News March 14, 2025

WOW.. గ్రూప్స్‌లో సత్తాచాటిన సిద్దిపేట బ్రదర్స్

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతుల కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నోడు హరికృష్ణ గ్రూప్‌-2లో 184 ర్యాంక్ సాధించారు.

Similar News

News March 14, 2025

నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరు

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన నేత నాగబాబుకు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తొలిసారి ఏపీ శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు, ఆశీస్సులు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడుతూ విజయం సాధించాలి. ప్రజల అభిమానాన్ని మరింతగా చూరగొనాలి’ అని చిరు ట్వీట్ చేశారు.

News March 14, 2025

NLG: ఇది ప్రకృతి హోలీ

image

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్‌లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.

News March 14, 2025

శక్తి యాప్‌ను మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాలి: SP

image

మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తన మొబైల్ ఫోనులో డౌన్‌లోడ్ చేసుకోవాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఫోనులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో పోలీసులు సహాయాన్ని సులువుగా పొందవచ్చునన్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందన్నారు.

error: Content is protected !!