News March 14, 2025

HYD: అంగన్‌వాడీలకు సెలవు లేదు

image

హోలీ సందర్భంగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అయితే, అంగన్‌వాడీ ఉద్యోగినులు మాత్రం దీనికి మినహాయింపు. పండుగ రోజున కూడా విధులు నిర్వర్తించాల్సి రావడం వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కుటుంబంతో హోలీ జరుపుకునే అవకాశాన్ని దూరం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన హక్కులు కల్పించాలని, ప్రభుత్వ వైఖరి మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News April 17, 2026

SU పరిధిలో పరీక్షా ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో జరగనున్న PG, MBA, MCA 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 27 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో ఏప్రిల్ 29 వరకు చెల్లించవచ్చని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పరీక్షలు జూన్‌లో జరుగుతాయన్నారు.

News April 17, 2026

హార్ముజ్‌ను ఓపెన్ చేసినందుకు థాంక్స్: ట్రంప్

image

హార్ముజ్‌ ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశానికి థాంక్స్ చెప్పారు. జలసంధిని ‘స్ట్రెయిట్ ఆఫ్ ఇరాన్’ (ఇరాన్ జలసంధి)గా ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇన్నాళ్లూ హార్ముజ్‌ను తెరవమని ట్రంప్ ఒత్తిడి చేసినా తలొగ్గని ఇరాన్ లెబనాన్-ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌తో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపైనా ఆశలు చిగురించాయి.

News April 17, 2026

పోలీసుల సమస్యలు పరిష్కారానికే గ్రీవెన్స్ డే: మన్యం ఎస్పీ

image

పార్వతీపురం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించి 7 వినతులు స్వీకరించారు. సిబ్బంది శాఖాపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికి ఈ గ్రీవెన్స్ నిర్వహించామన్నారు. పోలీస్ సిబ్బంది వారి సమస్యలను అర్జీలలో అందజేశారు. వినతులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. అనారోగ్యపరమైన, బదిలీ కోరుతూ వచ్చినవే ప్రధానంగా ఉన్నాయన్నారు.