News March 14, 2025

గుంటూరు: లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

image

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లపాడు రోడ్డులోని ఓ కళాశాల వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొత్తకాలనీ ప్రాంతానికి చెందిన రత్నాకర్(64)బైక్‌పై వెళ్తుండగా వెనుకగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టి పైకి ఎక్కింది. దీంతో రత్నాకర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సింది.

Similar News

News March 12, 2026

అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

image

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్‌ఫ్రా, హైకోర్టు సైట్‌లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

image

గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.