News March 14, 2025

వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు

image

కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన <<15745116>>వైసీపీ<<>> నాయకుడు సోముల లోకేశ్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో అదే గ్రామానికి చెందిన 9మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. గ్రామానికి చెందిన సూర చిన్న సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సురేశ్ కుమార్ రెడ్డి, రవి కుమార్ రెడ్డి, కోదండరామిరెడ్డి, మోహన్, ఆర్.చిన్న సుబ్బారెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు.

Similar News

News April 17, 2026

జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్ డా.ఏ.సిరి

image

కర్నూలు జిల్లాలో పన్ను చెల్లింపుదారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి పరిశ్రమకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.190 కోట్ల బకాయిలను త్వరగా వసూలు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు, పరిశ్రమల చెల్లింపులను పర్యవేక్షించాలని ఆమె కోరారు. డీడీఓలు తప్పనిసరిగా జీఎస్టీ-టీడీఎస్ కింద నమోదు కావాలని పేర్కొన్నారు.

News April 17, 2026

కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

కర్నూలు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 12,50,166 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 6,21,167 మంది, మహిళలు 6,28,834 మంది, ఇతరులు 165 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.