News March 14, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మ.12 వరకు, మ.2.30 నుంచి సా.5.30 వరకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయి. పరీక్షలు ముగిశాక ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Similar News
News March 14, 2025
గుడ్ల కోసం అమెరికా యాతన, ఈయూకి యాచన

అమెరికాను గుడ్ల కొరత వేధిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు భారీగా చనిపోతుండటంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏడాది కాలంలో గుడ్ల ధర ఏకంగా 59శాతం మేర పెరగడం ట్రంప్ సర్కారుపై ఒత్తిడిని పెంచుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్ సహా ఐరోపా సమాఖ్యలోని దేశాలు ఎన్ని వీలైతే అన్ని గుడ్లను పంపించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.
News March 14, 2025
రేపటి నుంచి ఒంటిపూట అంగన్వాడీ కేంద్రాలు

TG: అంగన్వాడీ కేంద్రాలను రేపటి నుంచి ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది. అటు పాఠశాలలు కూడా రేపటి నుంచి ఒంటిపూట నడవనున్నాయి.
News March 14, 2025
రెండు రోజులు బ్యాంకులు బంద్!

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారంలో 5 రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు UFBU సమ్మె చేస్తోంది.