News March 14, 2025

గుంటూరులో గుండె జబ్బు నిర్ధారించే యాప్ 

image

ఆటలాడే వయసులో సిద్ధార్థ్ అనే 14ఏళ్ల బాలుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సిర్కాడివీయా యాప్ రూపొందించి అద్భుతం సృష్టించాడు. డల్లాస్‌కు చెందిన సిద్ధార్థ్ MP పెమ్మసాని సహకారంతో యాప్ ద్వారా GGHలో గుండె జబ్బు నిర్ధారణ పరీక్షలు చేశారు. 500 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి గుండె జబ్బు ఉందని యాప్ పసిగట్టింది. GGH సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి సిద్ధార్థ్‌ని అభినందించారు.

Similar News

News March 14, 2026

సూళ్లూరుపేట: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడీ

image

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకొని పరారయ్యాడు. ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

NRPT: జిల్లాలో సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్

image

జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, గృహావసరాలకు విద్యాలయాలకు, ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో లోటు రానివ్వమని అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు సెల్స్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సిలిండర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు అందించాలని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మకండని సూచించారు.

News March 14, 2026

తిరుపతి: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడి

image

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు ₹30 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించుకుని పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.