News March 14, 2025
కాటారం: ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిక్కని పెద్దపులి

కాటారం మండలం వీరాపూర్ అడవుల్లో లేగ దూడపై దాడి చేసి చంపిన పెద్దపులి మళ్లీ ఇప్పటి వరకు అటువైపు రాలేదు. లేగ దూడను చంపిన ప్రదేశంతో పాటు పలు ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా పెద్దపులి చిక్కలేదని తెలుస్తోంది. లేగ దూడను చంపి అన్నారం వైపుగా వెళ్లినట్లు అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లొద్దని, పులికి హాని కలిగించే చర్యలు చేపట్ట వద్దని హెచ్చరిస్తున్నారు.
Similar News
News April 16, 2026
ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)
News April 16, 2026
100 రోజుల జలధార’తో భూగర్భ జలాల పెంపు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘100 రోజుల జలధార’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, జిల్లాలో భూగర్భ జలాల మట్టాన్ని 3 నుంచి 6 మీటర్ల వరకు పెంచాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో ‘100 రోజుల జలధార’ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News April 16, 2026
IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.


