News March 14, 2025
మంగపేట: చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

మంగపేట మండలం బాలన్నగూడెంకు చెందిన దన్నూరి సాయికుమార్ (22) ద్విచక్ర వాహనంపై కరకగూడెం మండలం చొప్పల గ్రామంలో జరుగుతున్న ముసలమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నరసాపూర్ వద్ద చెట్టుకు ఢీ కొట్టి అక్కడికి అక్కడికే మృతి చెందాడు. బైకుపై ఉన్న ఇంకో యువకుడు దోమల గ్రామానికి చెందిన పాయం నితిన్ తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానికులు ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 23, 2026
NLG: జీజీహెచ్‌లో వేధింపులు.. రేడియోగ్రాఫర్‌పై వేటు!

నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పారామెడికల్ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఓ రేడియోగ్రాఫర్‌పై వేటు పడింది. విద్యార్థినిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సదరు విద్యార్థిని చేసిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారి.. ఆర్ఎంఓతో కమిటీ వేసి విచారణ జరిపించారు.
News March 23, 2026
భద్రాద్రి: రామయ్య భూములపై అక్రమార్కుల కన్ను!

భద్రాద్రి రాముడికి చెందిన వందల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉన్న 1340 ఎకరాల దేవస్థానం భూముల్లో సుమారు 900 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో సర్వే నెం 1 నుంచి 101 మధ్య 850 ఎకరాలు రాజకీయ నేతల అండతో కబ్జాకు గురయ్యాయని, ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదని రామాలయం అధికారులు తెలిపారు.
News March 23, 2026
కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భిక్కనూర్‌లో అత్యధికంగా 37.1°C నమోదవగా, కొల్లూరు, ఎలుపుగొండ, నాగిరెడ్డిపేట్, బీర్కూర్, మాచాపూర్ ప్రాంతాల్లో 36°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దోమకొండ 35°C నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 32°C నుంచి 35°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


