News March 14, 2025
చందుర్తి: చిన్నారి వామిక ఇక లేదు

చందుర్తి మండల కేంద్రానికి చెందిన మర్రి వామిక (16 నెలలు) అనే చిన్నారి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. వామిక గత పది రోజుల నుంచి బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వామికను బతికించడం కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. అయినా వామిక బతకలేదు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News November 7, 2025
ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.
News November 7, 2025
HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్‌లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.
News November 7, 2025
రామగుండంలో PM అప్రెంటిషిప్ మేళా

RGM ప్రభుత్వ ఐటీఐలో NOV 10న ఉదయం 10 గంటలకు “ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా” నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ఎల్&టి, వరుణ్ మోటార్స్, స్నైడర్ ఎలక్ట్రికల్స్, తోషిబా, ఉషా ఇంటర్నేషనల్, కేశోరాం సిమెంటు వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటీఐ ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. అప్రెంటిషిప్ చేయదలచిన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు.


