News March 14, 2025
అనంతగిరి: ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

పేకాట ఆడుతున్న ఐదుగురిరి అరెస్టు చేసినట్లు అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. ఖానాపురం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించగా గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1,430 నగదు, రెండు బైక్‌లు, నాలుగు ఫోన్లను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 5, 2026
గన్నవరం: మంత్రి, MLAలు ఉన్న ఫ్లైట్‌లో సాంకేతిక లోపం

గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్‌లో సమస్యను పైలట్ గుర్తించి వెంటనే రన్‌వేపై విమానాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రత్తిపాటి పుల్లరావు, నేత కన్నా లక్ష్మీనారాయణ సహా 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ రద్దు కావడంతో ప్రయాణికులు రోడ్డు మార్గంలో బయలుదేరారు.
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.
News March 5, 2026
రాజమండ్రి: ఈనెల 8న జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(SAAP) ఆదేశాల మేరకు ఈ నెల 8న తూర్పుగోదావరి జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి(DSDO) డి.ఎమ్.ఎమ్. శేషగిరి తెలిపారు. హుకుంపేటలోని బొప్పన స్పోర్ట్స్ క్లబ్‌లో టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు, ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


