News March 14, 2025

PDTR: ఆసుపత్రిలో దొంగతనానికి విఫలయత్నం

image

ఆసుపత్రిలోనే డాక్టర్ చైన్ కొట్టేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ శ్రీవాణి గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ రూము వైపు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాగడానికి ట్రై చేశాడు. అతడిని వెనక్కి నెట్టేయగా.. మరోసారి చైన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్ కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Similar News

News April 4, 2026

జీఎస్టీ వసూళ్లలో TOP-6లో కడప డివిజన్

image

కడప డివిజన్లో జీఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.851.44 కోట్లు రాగా.. 2025-26లో రూ.932.83 కోట్లు వచ్చాయని SGST కడప జాయింట్ కమిషనర్ సుమతి తెలిపారు. నెలకు సగటున రూ.70.95 కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి. రూ.82.38 కోట్ల పెరుగుదల నమోదైంది. రూ.2025 మార్చిలో రూ.73.31 కోట్లు రాగా.. 2026 మార్చిలో రూ.84.39 కోట్లకు పెరిగాయి. గత నెలలో SGST నగదు వసూళ్లలో రూ.38.79 కోట్లతో స్టేట్‌లో కడప టాప్-6లో నిలిచింది.

News April 4, 2026

కడప: ఒక్క రోజులో 238 కేసులు నమోదు

image

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి రూ.46,590లు పెనాల్టీ వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అన్ని రకాల వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలను, డ్రైవింగ్ లైసన్స్‌లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News April 3, 2026

కడప జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు