News March 14, 2025
కాటారం: అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

కాటారం శివారులో చింతకాని క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గతరాత్రి లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. నిద్రమత్తులో లారీని డివైడర్ పైకి ఎక్కించినట్లు స్థానికులు తెలిపారు. ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసమైంది.
Similar News
News October 25, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
News October 25, 2025
భూపాలపల్లి: 27న మద్యం దుకాణాలకు డ్రా

భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన మద్యం దరఖాస్తులకు ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. రెండు జిల్లాలకు సంబంధించిన 59 మద్యం షాపులకు 1,863 దరఖాస్తులు వచ్చాయని, మల్లంపల్లి షాపునకు 77 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్‌లో దరఖాస్తుదారులు ఆర్టనైజ్డ్ రెప్రెసెంటివ్స్, రిసిప్ట్, ఎంట్రీ పాస్ ఒరిజినల్‌ను వెంట తీసుకురావాలన్నారు.
News October 25, 2025
జనగామ: భార్యాభర్తలిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష

భార్యాభర్తలిద్దరికీ రూ.5 వేల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష పడినట్లు నర్మెట్ట SI నగేశ్ తెలిపారు. వెల్డండకు చెందిన మంకెన నర్సిరెడ్డిని కొడుకు మల్లారెడ్డి, కోడలు పద్మ కలిసి ఆస్తి విషయంలో కొట్టి చంపారని ఆయన కూతురు లక్ష్మి 2019లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. వాదోపవాదనలు జరిగిన అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం జనగామ జిల్లా జడ్జి ప్రతిమ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.


