News March 14, 2025
అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది: హరీష్ రావు

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో దుయ్యబట్టారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని దళితుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కూడా కాంగ్రెస్ అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని ధ్వజమెత్తారు.
Similar News
News March 20, 2026
25న నంద్యాలలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 25న నంద్యాలలోని NTR షాదీఖానలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 870 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి PG వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని సూచించారు.
News March 20, 2026
అమలాపురం: డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ రీషెడ్యూల్

రంజాన్ సెలవు శనివారం నాటికి మార్పు కావడంతో లెర్నర్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్‌ను శుక్రవారానికి రీషెడ్యూల్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. అభ్యర్థులు శనివారం కాకుండా శుక్రవారమే సంబంధిత కార్యాలయానికి రావాలని సూచించారు. సెలవు మార్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
News March 20, 2026
ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొలువులకు ఇంటర్వ్యూలు

ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 106 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ప్రొఫెసర్ (15), అసోసియేట్ (27), అసిస్టెంట్ ప్రొఫెసర్ (41) కాంట్రాక్ట్ పోస్టులతో పాటు 23 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 24న ఉదయం 10 గంటలకు అసలు పత్రాలతో వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కళాశాల యాజమాన్యం సూచించింది.


