News March 14, 2025
కొత్తకోట: స్కూటీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కొత్తకోట పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ముమ్మళ్ళపల్లి గ్రామానికి చెందిన శేషన్న, సుధాకర్‌లు స్కూటీపై కొత్తకోటకు వచ్చి పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా స్కూటీలో మంటలు వస్తున్నట్లు గమనించి వెంటనే ఆపి పక్కకు జరిగారు. సమీపంలో ఫైర్ స్టేషన్ ఉండడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News March 22, 2026
కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం: CBN

1999-2004 మధ్య హైదరాబాద్‌ను శరవేగంగా అభివృద్ధి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. HYD ISBలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అప్పట్లో తాను కృషి చేయడం వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందని గుర్తు చేశారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయామని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిందన్నారు. 2014-19 వరకు APలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేమని తెలిపారు.
News March 22, 2026
అమరచింత: జూరాల ప్రాజెక్టు తాజా నీటిమట్టం

జూరాల ప్రాజెక్టులో ఆదివారం ఉదయం నాటికి 5.439 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారి వెంకటేశ్ తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,228 క్యూసెక్కులు ఉండగా, మొత్తం అవుట్ ఫ్లో 8,888 క్యూసెక్కులుగా నమోదైంది. ఎడమ కాలువ ద్వారా 820 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News March 22, 2026
కర్నూలులో 23న ప్రజా ఫిర్యాదుల వేదిక: కలెక్టర్

ఈ నెల 23 (సోమవారం)న కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.


