News March 14, 2025
నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా లక్మాపూర్, మోస్రా, మగ్గిడి, ఎర్గట్ల ప్రాంతాల్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మల్కాపూర్, ఆలూర్, గోపన్నపల్లి, వెంపల్లె, తొండకూర్లో 40℃, మాచర్ల, మోర్తాడ్, నిజామాబాద్, మెండోరా 39.9, పోతంగల్, కోటగిరి 39.8, పెర్కిట్ 39.7, మంచిప్ప 39.6, నందిపేట 39.5, ఇస్సాపల్లె, ఎడపల్లె 39.4, బాల్కొండ, జానకంపేట్ 39.2, జక్రాన్‌పల్లి, కమ్మర్పల్లిలో 39.1℃గా నమోదైంది.
Similar News
News March 15, 2025
NZB: రైల్వే స్టేషన్‌లో చిన్నారి MISSING

నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ చిన్నారి అదృశ్యమైనట్లు 1 టౌన్ SHO రఘుపతి శనివారం తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన చిన్నారి స్టేషన్‌లో కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికిన చిన్నారి జాడ దొరకలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
News March 15, 2025
NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.
News March 15, 2025
గ్రూప్-3లో 24 ర్యాంక్ సాధించిన జిల్లా వాసి

ఆర్మూర్ పట్టణానికి చెందిన దొంద రామ్ కిషోర్ గ్రూప్-3 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తాచాటారు. 317 మార్కులతో రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంక్ సాధించారు. ఇటీవల ఆయన గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నిజామాబాద్‌లో కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.