News March 14, 2025
పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.
Similar News
News April 18, 2026
KNR: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HYD దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ సంస్థలో 3 సంవత్సరాల 2026-27 డిప్లమో కోర్సులకు అనాధ బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారి తెలిపారు. దీనికి పాలిటెక్ని ప్రవేశపరిక్ష రాయకున్నా టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎంపికైన వారికి ఉచిత విద్య వసతి కల్పిస్తారు. మే 23లోగా KNR బాల రక్షభవన్లో దరఖాస్తు చేయాలి. వివరాలకు 9490881098 సంప్రదించవచ్చు.
News April 18, 2026
KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.