News March 14, 2025
MTM: గవర్నర్‌ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్‌ను రాజ్ భవన్‌లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.
Similar News
News March 6, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* నాగాయలంక: 18 నెలల పసికందును కాటేసిన పాము
వీరవల్లి: ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి ఘటనలో విద్యార్థులకు కౌన్సెలింగ్
* విజయవాడ: OLX పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
* విజయవాడలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులకు కౌన్సెలింగ్
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కుంబాభిషేకం
* అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే
News March 6, 2026
కృష్ణా: గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన

కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండో పంటైన అపరాల సాగు కోత పనులు ఊపందుకున్నాయి. అయితే అపరాల సాగు ప్రారంభ దశలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్లు వ్యాపించి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అపరాలు విక్రయాలు చేద్దామన్న మద్దతు ధర లేక రైతులు సిండికేట్‌గా మారిన దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News March 6, 2026
విద్యార్థులు పెడదోవ పట్టకుండా అవగాహన కల్పించాలి: కృష్ణా కలెక్టర్

విద్యార్థులు పెడదోవ పట్టకుండా విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంచి, చెడుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి తన చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.


