News March 14, 2025
మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News November 3, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కాలినడకన వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. కాలినడకన వెళ్తున్న చేగుంటకు చెందిన కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
News November 3, 2025
మెదక్: 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.
News November 2, 2025
మెదక్: రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రానున్న మూడు రోజుల్లో మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం తెలిపారు. ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడాలని, రైతులకు వర్షం వల్ల ఎలాంటి అసౌకర్యం, ధాన్యం తడిచి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.


