News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
Similar News
News March 14, 2025
నా కంటే మా అన్నయ్యలను నాన్న ఎక్కువ కొట్టేవారు: పవన్

AP: సెకండ్ షో సినిమాకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను కోట్లమందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి రాతేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఓ రోజు సెకండ్ షోకు వెళ్లొచ్చేసరికి మా నాన్న కోపంతో ఉన్నారు. ఆయన కొడతారని భయపడ్డా. కానీ నేను హీరోనని, 4 సినిమాలు హిట్లయ్యాయని చెప్పా. ఇంకా ఎక్కువ తిట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే నా కంటే మా అన్నయ్యలను ఆయన ఎక్కువ కొట్టేవారు’ అని చెప్పుకొచ్చారు.
News March 14, 2025
ఫ్యాన్స్కి CSK జట్టు ఫ్రీ బస్!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నైలో జరిగే మ్యాచులు ఆరంభమయ్యే 3 గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో(నాన్ ఏసీ) ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ అంతా ఇది వర్తించనుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అభిమానులకు సీఎస్కే చాలా ప్రేమను తిరిగిస్తోందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది.
News March 14, 2025
పార్వతీపురం: రేపటి నుంచి ఒంటిపూట బడులు

రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని డీఈఓ ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో పరీక్షలు ముగిసేంతవరకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు.