News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు
Similar News
News March 5, 2026
కామారెడ్డి: కలెక్టర్‌ను కలిసిన ఈఈ అశోక్

తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఈఈ అశోక్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యాసంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై చర్చించారు.
News March 5, 2026
సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం పేరు మార్పు

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావు పేరు పెట్టారు. వెంగళరావు పేరు పెట్టేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లకు మున్సిపాలిటీ ప్రజలు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దృఢమైన పునాదులు వేశారు.
News March 5, 2026
10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు Arrive-Alive కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహిస్తారని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.


