News March 14, 2025
కాళ్ల : బతుకుదెరువు కోసం వస్తే జీవితాలు ఛిద్రమయ్యాయి!

బతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు.
Similar News
News March 6, 2026
కదిరిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల అరెస్ట్

కదిరి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.5,65,000 విలువ చేసే నగలు, రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 6, 2026
సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని ఆమె ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 6, 2026
నేపాల్.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బాలేంద్ర షా పార్టీ

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 90కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేపాల్‌లో 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రజల ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మిగిలిన 110 సీట్లను రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. 165 సీట్లలో 84 గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.


