News March 14, 2025

రాజమండ్రి: గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

image

రాజమండ్రి వద్ద గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ నగరం తూరంగి డ్రైవర్స్ కాలనీకి చెందిన భార్యభర్తలు కాళ్ల వెంకట రమణ, వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఘాట్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 21, 2026

ఇరాన్ ప్రెసిడెంట్‌కు మోదీ ఈద్ శుభాకాంక్షలు

image

తాను ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ‘ఆయనకు ఈద్ శుభాకాంక్షలు చెప్పాను. ఈ పండుగ వెస్ట్ ఆసియాలో శాంతి, స్థిరత్వం తీసుకొస్తుందని ఆశించాం. అక్కడి కీలక ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులను ఖండించాను. దీనివల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతిని గ్లోబల్ సప్లై చైన్‌కు అంతరాయం కలుగుతుంది. ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు మద్దతిచ్చినందుకు అభినందించాను’ అని తెలిపారు.

News March 21, 2026

ఎన్టీఆర్ జిల్లాలో సీఐల బదిలీ

image

ఎన్టీఆర్ జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుణదల సీఐగా సత్య రమేష్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. గుణదలలో ఉన్న వాసిరెడ్డి శ్రీనును సైబర్ క్రైమ్‌కు, అజిత్ సింగ్ నగర్ సీఐగా చంద్రశేఖర్‌, అజిత్ సింగ్ నగర్‌లో ఉన్న వెంకటేశ్వర్లను సీసీఎస్‌కు అటాచ్ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News March 21, 2026

ఏఐ శిక్షణ పూర్తి చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

image

ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో నిర్వహించిన ఏఐ శిక్షణను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూర్తి చేశారు. మార్చి 16–20 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో డిజిటల్ పరిపాలన, కృత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన పొందారు. ఈ శిక్షణతో జిల్లాలో సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు సహాయపడుతుందని తెలిపారు.