News March 14, 2025

ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.

Similar News

News April 20, 2026

విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

image

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

News April 20, 2026

8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.

News April 20, 2026

హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

image

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.