News March 14, 2025
MHBD: బైకులో పాము కలకలం (PHOTO)

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివాజీ బైక్‌లో పాము చేరింది. శివాజీ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌లో పాము దూరింది. వెంటనే పైకి లేవగా, అప్రమత్తమైన అధికారి బైక్‌ను పక్కకు నిలిపాడు. సుమారు 2 గంటల తర్వాత పాము కిందకు దిగివెళ్లిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News November 10, 2025
శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్‌కు 102 అర్జీలు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 102 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. అందులో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్తు సంస్థ వంటి పలు శాఖలకు దరఖాస్తులు అందాయన్నారు. త్వరగతిన అర్జీలు పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
News November 10, 2025
అనకాపల్లి జిల్లా పోలీస్ పీజీఆర్ఎస్‌కు 50 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు 50 ఫిర్యాదులను అందజేశారు. ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు.భూ తగాదాలకు సంబంధించి 19, రెండు కుటుంబ కలహాలు, రెండు మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర విభాగాలకు చెందినవి 27 ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 10, 2025
తల్లి పరీక్ష రాస్తుండగా ఏడ్చిన బిడ్డ.. పాలిచ్చిన పోలీసమ్మ!

ఓ బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. పరీక్ష రాసేందుకు బిడ్డతో సెంటర్‌కు వచ్చిన ఓ తల్లి.. తన బిడ్డను బయటే ఉంచేసింది. ఆకలితో ఆ శిశువు గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆ బిడ్డను హత్తుకున్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ఆమె స్వయంగా పాలిచ్చి లాలించారు. కానిస్టేబుల్ చూపిన మాతృప్రేమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


