News March 14, 2025
CM గారికి ఇంత అసహనం పనికిరాదు: కవిత

TG: BRS MLA జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. ‘ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు? జగదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి, CM గారికి ఇంత అసహనం పనికిరాదు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే సస్పెండ్ చేశారు’ అని ఆరోపించారు.
Similar News
News March 14, 2025
ఈ ఐదు రోజులు జాగ్రత్త!

TG: వేసవి వచ్చేసింది. అసలే ఓవైపు ఎండలు దంచికొడుతుంటే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19 వరకు వేడిమి మరీ ఎక్కువ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఆరుబయట పని చేసే రైతాంగం చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. అయితే ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్వల్ప ఉపశమనం లభిస్తుందని, ఆ 5 రోజుల పాటు స్వల్ప వర్షపాతం ఉంటుందని తెలిపారు.
News March 14, 2025
నా కంటే మా అన్నయ్యలను నాన్న ఎక్కువ కొట్టేవారు: పవన్

AP: సెకండ్ షో సినిమాకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను కోట్లమందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి రాతేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఓ రోజు సెకండ్ షోకు వెళ్లొచ్చేసరికి మా నాన్న కోపంతో ఉన్నారు. ఆయన కొడతారని భయపడ్డా. కానీ నేను హీరోనని, 4 సినిమాలు హిట్లయ్యాయని చెప్పా. ఇంకా ఎక్కువ తిట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే నా కంటే మా అన్నయ్యలను ఆయన ఎక్కువ కొట్టేవారు’ అని చెప్పుకొచ్చారు.
News March 14, 2025
ఫ్యాన్స్‌కి CSK జట్టు ఫ్రీ బస్!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నైలో జరిగే మ్యాచులు ఆరంభమయ్యే 3 గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో(నాన్ ఏసీ) ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ అంతా ఇది వర్తించనుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అభిమానులకు సీఎస్కే చాలా ప్రేమను తిరిగిస్తోందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది.