News March 14, 2025
మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్‌లో నివాసం ఉండే వి.శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్న శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రీధర్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో 11, 929 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కామారెడ్డి-నిజామాబాద్ జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ ఖరీఫ్‌లో 70 రోజులు దాటినా వరద కొనసాగుతోంది. మంగళవారం 11,929 క్యూసెక్కుల వరద రాగా, 2 గేట్లు ఎత్తి 8,096 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,404.99 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నారు.
News November 5, 2025
విమాన ప్రయాణికులకు శుభవార్త

విమాన టికెట్ల రద్దు అంశంపై ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి ఛార్జీ లేకుండా రద్దు చేసుకోవడం/ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. క్రెడిట్ కార్డు ద్వారా అయితే 7 రోజుల్లో, ట్రావెల్ ఏజెంట్/పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే 21 పనిదినాల్లో రిఫండ్ అందుతుంది. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5D, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో 15D లోపు ఈ సౌకర్యం వర్తించదు.
News November 5, 2025
శ్రీరాంపూర్: సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని ఎస్టీపీపీ డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పోరేట్‌కు బదిలీ చేశారు.


