News March 14, 2025
బాచుపల్లి: కాలుష్యంపై రేపు నిరసన

పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు నిరసన తెలియచేయనున్నట్లు 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మీ సుబ్బారావు తెలిపారు. సనత్‌నగర్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో రేపు ఉదయం 11 గం.లకు అధికారులకు వినతిపత్రం అందచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
Similar News
News November 5, 2025
కృష్ణా: NH 65 రహదారి విస్తరణపై అధికారులు, MLAల సమావేశం

విజయవాడ-మచిలీపట్నం మధ్యనున్న NH 65 రహదారి 6 లైన్ల విస్తరణపై బుధవారం విజయవాడలో అధికారులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కలెక్టర్లు DK బాలాజీ, డా.లక్ష్మీశా, జేసీలు ఎం.నవీన్, ఎస్.ఇలక్కియా, NHAI అధికారులు పాల్గొన్నారు. ఈ రహదారిలో బెంజిసర్కిల్ నుంచి చినగార్లపాడు వరకు అండర్ పాస్‌లు నిర్మించాలని, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రస్తుత డిజైన్లను సైతం మార్చాలని అధికారులు, ఎమ్మెల్యేలు NHAI అధికారులకు సూచించారు.
News November 5, 2025
కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.
News November 5, 2025
పల్వంచ: చదువుల తల్లికి గుడి కట్టిన దేవుళ్లు వీరే!

ఫరీద్‌పేట్ గ్రామంలో నూతన గ్రంథాలయం బుధవారం ప్రారంభమైంది. జీడిపల్లి నర్సింహా రెడ్డి తన కూతురు, తండ్రి స్మారకార్థం రూ. 20 లక్షల సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, యువకులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని దంపతులిద్దరూ ఆకాంక్షించారు. గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేసిన వీరికి పలువురు అభినందించి శాలువాతో సత్కరించారు.


