News March 14, 2025
ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 14, 2025
నా కంటే మా అన్నయ్యలను నాన్న ఎక్కువ కొట్టేవారు: పవన్

AP: సెకండ్ షో సినిమాకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను కోట్లమందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి రాతేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఓ రోజు సెకండ్ షోకు వెళ్లొచ్చేసరికి మా నాన్న కోపంతో ఉన్నారు. ఆయన కొడతారని భయపడ్డా. కానీ నేను హీరోనని, 4 సినిమాలు హిట్లయ్యాయని చెప్పా. ఇంకా ఎక్కువ తిట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే నా కంటే మా అన్నయ్యలను ఆయన ఎక్కువ కొట్టేవారు’ అని చెప్పుకొచ్చారు.
News March 14, 2025
ఫ్యాన్స్‌కి CSK జట్టు ఫ్రీ బస్!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నైలో జరిగే మ్యాచులు ఆరంభమయ్యే 3 గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో(నాన్ ఏసీ) ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ సీజన్ అంతా ఇది వర్తించనుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అభిమానులకు సీఎస్కే చాలా ప్రేమను తిరిగిస్తోందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది.
News March 14, 2025
వర్తు వర్మ.. ‘వారి కర్మ’

AP: పిఠాపురంలో పవన్ గెలుపుపై నాగబాబు చేసిన తాజా <<15761376>>వ్యాఖ్యలు<<>> YCPకి అస్త్రంగా మారాయి. వర్మ సపోర్టు వల్లే తాను అక్కడ గెలిచానని చెప్పిన పవన్ ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని ఇప్పుడు ’వారి కర్మ’ అంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.