News March 14, 2025

మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (1/2)

image

మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో.. తుర్కపల్లి, లాగ్‌గడిమలక్‌పేట, మజీద్‌పూర్, మందాయిపల్లి, సింగాయిపల్లి, మురహరిపల్లి, యాచారం. మూడుచింతలపల్లిలో.. లింగాపూర్, ఉద్దేమర్రి, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూర్, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపనబోలు, కేశవాపూర్ గ్రామాలు విలీనం కానున్నాయి.

Similar News

News March 6, 2026

ఎన్నికల వరకే రాజకీయాలు: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం: ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత ప్రభుత్వంతో కలిసి ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు.

News March 6, 2026

తిరుపతి: 283 మంది గైర్హాజరు

image

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9,880 మంది విద్యార్థులకు గాను 9,597 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 283 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.

News March 6, 2026

మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన కామారెడ్డి కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభ కార్యక్రమంలో శుక్రవారం నిజామాబాద్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ప్రారంభించేందుకు వచ్చాకగ. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పూల బొకేలు అందజేసి మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.