News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (2/2)

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట పేర్లతో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో.. శ్రీరంగవరం, బండమాధరం, నూతనకల్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్‌కోల్, కండ్లకోయ, రాజ్‌బొల్లారం, ఘన్పూర్, గోసాయిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ నెల 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
Similar News
News October 23, 2025
VJA: వర్షాల ఎఫెక్ట్.. అమాంతం పెరిగిన టమాటా ధరలు.!

నిన్న మొన్నటి వరకు టమాటాకు మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెట్టారు. అయితే, 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. 2 రోజుల క్రితం బాక్స్ టమాటా రూ.500-600 ఉండగా, ప్రస్తుతం రూ.1,200లు పలుకుతోంది. విజయవాడ మార్కెట్‌లో వినియోగదారులు KG టమాటా రూ.38-40కు కొంటున్నారు. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
News October 23, 2025
సంగారెడ్డి: ‘నవంబర్‌లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్’

నవంబర్ రెండో వారంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం తెలిపారు. 6 నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు నమూనాలు తయారు చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని చెప్పారు. మంచి ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.
News October 23, 2025
ఆదిలాబాద్: ’26లోపు కొటేషన్లు సమర్పించాలి’

ADB జిల్లాలోని15 ప్రీ-ప్రైమరీ పాఠశాలల కోసం ఫర్నీచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ మెటీరియల్ పెయింటింగ్ పని, కొనుగోలు నిమిత్తం స్థానిక ఫర్ముల నుంచి సీల్ చేసిన కోటేషన్లకు ఆహ్వానిస్తున్నట్లు DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఆసక్తి గల స్థానిక ఫర్ములు లేదా సరఫరాదారులు, సంబంధిత వివరాల అవసరాల జాబితా కోసం డీఈఓ క్వాలిటీ కోఆర్డినేటర్ ను సంప్రదించాలన్నారు. కోటేషన్లు ఈనెల 26లోపు సమర్పించాలన్నారు