News March 14, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా: హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన హోలీ సంబరాలలో బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేపీ కార్యకర్తలతో జిల్లా కలెక్టర్ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
KNR: ‘కొత్త కలెక్టరేట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి’

కరీంనగర్ జిల్లా కొత్త కలెక్టరేట్ పనులను సత్వరమే పూర్తి చేసి, భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె.. ప్రధాన గేటు, విద్యుత్, పైపులైను వంటి పెండింగ్ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రారంభానికి సిద్ధం చేసేలా పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.
News March 13, 2026
మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
News March 13, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, సరఫరా యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో సమీక్షించిన ఆమె, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ కోసం 12 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9154249727ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.


