News March 14, 2025

HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

image

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.

Similar News

News November 14, 2025

వీరుడు, సంఘసంస్కర్త పల్నాడు బ్రహ్మనాయుడు

image

11వ శతాబ్దంలోనే కుల మతాలకతీతంగా చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మాచర్ల మహామంత్రి పల్నాడు బ్రహ్మనాయుడు. ఆయన పాలనా, ధర్మ పోరాటం, సమానత్వ సాధనలో మార్గదర్శకుడు. మాల కన్నమదాసును దత్తత తీసుకొని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. మాచర్ల, మార్కాపురం, కారంపూడిలో ఆయన కట్టించిన వైష్ణవాలయాలు నేటికీ ఉన్నాయి. యుద్ధంలో ఓడిపోయినప్పటికీ నాగమ్మను చంపకుండా వదిలివేసి యుద్ధ నీతిని చాటిచెప్పాడు.

News November 14, 2025

జూబ్లీ కౌంటింగ్: దద్దరిల్లనున్న హైదరాబాద్

image

రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన ఫలితం నేడు వెలువడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజేత ఎవరు? అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్ వైపు చూపినా.. కొన్ని సర్వేలు BRSకు అనుకూలంగా వచ్చాయి. ఇవి ఎగ్జాక్ట్ కాకపోయినా పోలింగ్‌లో సైలెంట్ ఓటింగ్ కీలకంగా మారింది. మధ్యాహ్నం లోపు విజయం తేలనుండడంతో సంబరాలకు శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఎవరు గెలిచినా నగరం హోరెత్తనుంది.