News March 14, 2025

వేమనపల్లిలో పండగ పూట విషాదం

image

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.

Similar News

News November 12, 2025

HNK: మూడో రోజు.. మూడు జిల్లాల యువత సత్తా చాటారు!

image

హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ మూడో రోజు మూడు జిల్లాల అభ్యర్థులతో ఉత్సాహంగా సాగింది. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎంపికైన 623 మంది అభ్యర్థులు రన్నింగ్‌, ఫిజికల్‌ ఫిట్నెస్‌ పరీక్షల్లో పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు ఎత్తు, బరువు, ఛాతీ ప్రమాణాలను పరీక్షించి, ఉత్తీర్ణులైన వారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించారు.

News November 12, 2025

VJA: నకిలీ మద్యం కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

image

ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ మాజీమంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 26లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది. సిట్ విచారణ తీరు దారి తప్పుతోందని జోగి రమేశ్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఈ కేసులో 16 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

News November 12, 2025

జమ్మూకశ్మీర్‌లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.