News March 14, 2025
వేమనపల్లిలో పండగ పూట విషాదం

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.
Similar News
News March 15, 2025
ADB: రేపే ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 15, 2025
జైనథ్: 2 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అశోక్

జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన దుర్ల అశోక్ కుమారుడు అవినాశ్ శుక్రవారం విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో ఎంపికయ్యారు. ఆయన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ఉద్యోగం సాధించారు. జిల్లాకేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటు ప్రిపేర్ అయినట్లు అవినాశ్ తెలిపారు. ఉద్యోగం సాధించడం పట్ల ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేశ్ ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
News March 15, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి ADB జిల్లా జట్టు

ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు గొప్ప క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు. జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.