News March 14, 2025

SKLM: పలాసలో 23న స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ సభ

image

పలాస మండలం మా కన్నపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్‌ల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News January 12, 2026

కాశీబుగ్గ: చిన్న తిరుపతి వెంకన్నకు కష్టాలు తప్పవా?

image

తిరుపతిలోని వేంకటేశ్వురుడి దర్శనం జరగనందున ఆవేదన చెంది కాశీబుగ్గలో ఏకంగా ఆ శ్రీనివాసుడికి ధర్మకర్త పండా గుడి కట్టారు. భక్తుల దర్శనాలు జరుగుతున్న క్రమంలో..గతేడాది NOV1న తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా ఆలయాన్ని మూసేశారు. పునఃప్రారంభానికి శరవేగంగా పనులవుతున్నాయి. ఇంతలోనే భారీ <<18834092>>చోరీ<<>> జరిగింది. పూజలందుకోవాల్సిన వెంకన్నకు కష్టాలు తప్పడం లేదని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.

News January 12, 2026

అంతర్జాతీయ బ్యాడింటన్ పోటీలకు అంపైర్‌గా కవిటి వాసి

image

కవిటి గ్రామానికి చెందిన తుంగాన శరత్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు అంపైర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 13-18 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీలకు ఆయన అంపై‌ర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఎంపికకు సంబంధించి రాష్ట్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ల నుంచి ఆదివారం అధికారిక ఉత్తర్వులు అందినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు.

News January 12, 2026

శ్రీకాకుళం: జనరల్ బోగీలతో ప్రత్యేక రైలు..ఈ నెల18 వరకే ఛాన్స్

image

సంక్రాతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12-18 వరకు జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వాల్టేర్ డివిజన్ సీనియర్ డీసీ పవన్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-విజయవాడ(08567-68) ట్రైన్ విశాఖలో ఉదయం 10గం.లకు బయలుదేరి సాయంత్రం 4గం.టలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ మధ్య సాయంత్రం 6.30. గంలకు ప్రారంభమై అర్ధరాత్రి12.30 గం.ల వరకు నడవనుంది.