News March 14, 2025

ఎలాన్‌ మస్క్ Starlinkకు కేంద్రం షరతులు!

image

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో జట్టుకట్టిన స్టార్‌లింకుకు కేంద్రం కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రవేశించాలంటే కచ్చితంగా కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. శాంతిభద్రతల నియంత్రణకు ఇది కీలకం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి చేయిదాటినప్పుడు ఇంటర్నెట్‌ను నిలిపివేయాలంటే ప్రతిసారీ USలోని స్టార్‌లింక్ ఆఫీస్‌ను సంప్రదించడం కుదరదు. అందుకే షరతులు పెట్టింది.

Similar News

News March 15, 2025

HEADLINES TODAY

image

AP: 11 ఏళ్ల జనసేన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది: పవన్
* పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ: నాగబాబు
* గన్నవరం నుంచి మంగళగిరికి పవన్‌కు హెలికాప్టరా?: వైసీపీ
TG: గ్రూప్-3 ఫలితాలు విడుదల
* తిరుమలలో మా లేఖలు అనుమతించాలి: MP రఘునందన్
* ఢిల్లీ నుంచి CM ఒక్క రూపాయీ తేలేదు: KTR
* DC కెప్టెన్‌గా అక్షర్ పటేల్

News March 15, 2025

పవన్ స్పీచ్‌‌కు మంత్రముగ్ధుడినయ్యా: చిరంజీవి

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యానని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సభకు వచ్చిన జనసంద్రంలాగే తన మనసు ఉప్పొంగిందని ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి‌తో పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని మెగాస్టార్ ఆశీర్వదించారు.

News March 15, 2025

ఇతర మతాలవారిని తిట్టగలరా?: పవన్ కళ్యాణ్

image

AP: తనను సనాతన ధర్మం రక్షకుడని ఓ ఆంగ్ల జర్నలిస్టు ఎద్దేవా చేశారంటూ Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడకూడదా? నోరు మూసుకుని కూర్చోవాలా? మీరు అల్లానో, జీసస్‌నో, మేరీమాతనో అవమానించి బతకగలరా? కానీ లక్ష్మీ దేవిని, సరస్వతి దేవిని అవమానిస్తారు. రథాల్ని తగులబెట్టేస్తారు. తప్పును తప్పని చెబితే మతోన్మాదమా?’ అని ప్రశ్నించారు.

error: Content is protected !!