News March 14, 2025
మఠంపల్లి: ఘనంగా హోలీ సంబరాలు

మఠంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ సంబరాలు శుక్రవారం అంబారాన్నంటాయి. ఈ మేరకు ఉదయం నుంచే యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు రంగులు పూసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం హోలీ.. హోలీ.. హోలీ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News March 18, 2026
నల్గొండ: మత సామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్

రంజాన్ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. బుధవారం స్టార్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 5,250 మంది పేద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేస్తోందని తెలిపారు. మైనార్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.
News March 18, 2026
NLG: వారం దాటినా అందని సిలిండర్లు!

జిల్లాలో గృహ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. సిలిండర్ కోసం ఫోన్ చేస్తే కలవకపోవడం, ఒకవేళ కలిసినా ఓటీపీ వెంటనే రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. బుకింగ్ పూర్తయినప్పటికీ వారం రోజులైనా సిలిండర్లు సరఫరా కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు