News March 14, 2025
ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌లో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News March 15, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు :SP

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జెరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరు ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2026
బాసర: IIIT విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన మాలవత్ పూర్ణ

బాసర IIITలో జరుగుతున్న ‘అంతఃప్రజ్ఞా-2026’ వేడుకల్లో భాగంగా ఎవరెస్ట్ విజేత మాలవత్ పూర్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఆమె స్ఫూర్తిని నింపారు. అడ్డంకులను చూసి భయపడకుండా లక్ష్యాల వైపు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వినూత్న సాంకేతిక ప్రాజెక్టులను ఆమె ఆసక్తిగా పరిశీలించారు.