News March 14, 2025
వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.
Similar News
News March 15, 2025
వరంగల్: నేటీ నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.
News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
News March 14, 2025
వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.