News March 14, 2025

జగిత్యాల: హోలీ వేడుకల్లో కలెక్టర్ దంపతులు

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు అదనపు కలెక్టర్ బి.ఎస్‌లత తో కలిసి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్ దంపతులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ పిల్లలకి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. నరేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్ పాల్గొన్నారు.

Similar News

News March 15, 2025

మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి సూసైడ్

image

మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని చిన్న రామయ్య(30) ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొలిమిగుండ్ల మండలం బెలుంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నరామయ్య ప్రతిరోజూ మద్యం తాగేవాడు. శుక్రవారం మద్యానికి భార్య శోభను డబ్బులు అడగగా.. ఆమె ఇవ్వలేదు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

News March 15, 2025

MLAలు రూ.800కోట్లు డిమాండ్ చేస్తున్నారు: DK శివకుమార్

image

బెంగళూరులో చెత్త సంక్షోభంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని Dy.CM DK శివకుమార్ ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యేలంతా కలసి సిటీ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.800 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్‌గా మారి ‌సాధారణ ధరల కంటే 85శాతం అధికంగా కోట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారన్నారు.

News March 15, 2025

జాతీయస్థాయి పోటీలకు మంచిర్యాల క్రీడాకారిణి

image

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట జనని జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవి, శివమహేశ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. జననిని అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు.

error: Content is protected !!