News March 14, 2025
పర పురుషులతో భార్య సెక్స్‌చాట్‌ను ఏ భర్తా భరించలేడు: హైకోర్టు

భార్య తన సెక్స్ లైఫ్ గురించి పరపురుషులతో చాటింగ్ చేస్తే ఏ భర్తా భరించలేడని MP హైకోర్టు తెలిపింది. ‘పెళ్లయ్యాక దంపతులు మొబైల్లో తమ మిత్రులతో అనేక అంశాలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఆ సంభాషణలు గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి అపోజిట్ జెండర్‌తోనైతే జీవిత భాగస్వామి గురించి అస్సలు అభ్యంతరకరంగా ఉండొద్దు’ అని పేర్కొంది. ఆ భార్య సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కుటుంబ కోర్టు మంజూరు చేసిన విడాకులను ఆమోదించింది.
Similar News
News February 23, 2026
‘అతిథి దేవో భవ’ అంటే అర్థం ఇదే..

‘తిథి’ అంటే ఓ రోజు లేదా సమయం. అదేదీ లేకుండా అకస్మాత్తుగా ఇంటికి వచ్చేవారినే ‘అతిథి’ అంటారు. ఇప్పుడు ఉన్నట్లు పూర్వం సమాచార వ్యవస్థ విస్తృతంగా ఉండేది కాదు. కాబట్టి అతిథులు ఎప్పుడైనా వచ్చేవాళ్లు. అలాంటి అతిథిని దేవుడితో సమానంగా చూడాలనేదే ఈ సూక్తి భావం. తైత్తిరీయ ఉపనిషత్తులోని శీక్షావల్లిలో ఈ ‘అతిథి దేవో భవ’ అని పేర్కొన్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు తర్వాత అతిథికి అంతటి ప్రాముఖ్యం ఇవ్వాలన్నమాట!
News February 23, 2026
భారీ జీతంతో NTPCలో 515 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 23, 2026
TG నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు?

TG: రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ, సురేశ్ రెడ్డి పదవీకాలం APR 9తో ముగియనుంది. ఆ ఖాళీలకు MAR 5లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. సింఘ్వీకి రెన్యువల్ ఉంటుందని సమాచారం. మరో స్థానం కోసం బెల్లయ్య, VH, మధుయాష్కీ, నరేందర్ రెడ్డి, కోదండరెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. TPCC చీఫ్ మహేశ్‌గౌడ్‌ను రాజ్యసభకు పంపి, ఆయన స్థానంలో MLCగా అజహరుద్దీన్‌ను ఎంపిక చేస్తారనే ప్రచారమూ ఉంది.


