News March 14, 2025
GWL: మరమ్మత్తుల కంటే.. కొత్త మోటర్లు బెటర్.!

GWL జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలకు నీటి వసతి కల్పించడంలో గ్రామ పంచాయతీలు ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నాయి. వేసవి కాలం మొదలైతే నీటి వనరులు అడుగంటి మోటర్లు స్టార్టర్లు పనిచేయవు. పాత వాటికీ మరమ్మతులు చేయించిన కొన్ని రోజులకే పాడౌతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం పదే పదే రిపైర్స్ అయ్యే వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News January 10, 2026
రేపు సూళ్లూరుపేట రానున్న హీరోయిన్ హెబ్బా.!

సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఫుల్ జోష్లో నడుస్తోంది. సెలబ్రిటీల రాకతో ఈ ఈవెంట్ మరింత కోలాహలంగా మారింది. ఇవాళ హైపర్ ఆది, రైజింగ్ రాజు, యాంకర్ సమీర సందడి చేయగా రేపు కార్యక్రమాలు మరింత సందడిగా సాగనున్నాయి. ఇందులో భాగంగా హీరోయిన్ హెబ్బా పటేల్ రానున్నారు. ఆమెతోపాటు యాంకర్ సాకేత్, ఇతర డాన్స్ బృందం ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు.
News January 10, 2026
బాలల రక్షణే లక్ష్యం: విశాఖ సీపీ

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి, వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. బాలలపై నేరాలను అరికట్టేందుకు ప్రోయాక్టివ్ పోలీసింగ్, ఫోరెన్సిక్ ఆధారాలతో వేగవంతమైన దర్యాప్తు, కోర్టు ప్రక్రియల్లో జాప్యం నివారణపై చర్చించారు. పోలీస్, న్యాయవ్యవస్థ, పౌర సమాజం కలిసి పనిచేసినప్పుడే బాలలకు భద్రత లభిస్తుందని, నేరస్థులకు కఠిన శిక్షలు పడతాయని సీపీ స్పష్టం చేశారు.
News January 10, 2026
ఎలమంచిలి: అనారోగ్య సమస్యలతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ

ఎలమంచిలి మున్సిపాలిటీ కోర్టు వీధిలో అనారోగ్య సమస్యలతో మేడిశెట్టి రాధిక(40) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆమె డాబా పైకి వెళ్లి 5 బాటిళ్ల పెట్రోల్ శరీరంపై పోసుకుని నిప్పు అంటించుకున్నారు. రాధిక భర్త పెద్దపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. పట్టణ ఎస్ఐ సావిత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.


