News March 14, 2025

రన్యా రావుకు బెయిల్ నిరాకరణ

image

<<15652905>>బంగారం స్మగ్లింగ్ కేసులో <<>>అరెస్టైన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై నమోదైన కేసులు చాలా తీవ్రమైనవంటూ DRI న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించింది. ఈ కేసులో పలువురు బడాబాబులు ఆమె వెనుక ఉన్నారన్న అనుమానాలున్నాయి. దీంతో రన్యా ఎవరి పేరు చెబుతారోనని బ్యూరోక్రాట్లు, బడా రాజకీయ నేతల్లో గుబులు నెలకొన్నట్లు కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Similar News

News March 15, 2025

గెలవక ముందు జనసేనాని, గెలిచాక ‘భజన’ సేనాని: ప్రకాశ్ రాజ్

image

నిన్న రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన <<15763560>>మాటలపై<<>> నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. పవన్ గెలవక ముందు ‘జనసేనాని’, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా? అని ప్రశ్నించారు. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టుల్ని ట్వీట్‌కి జత చేశారు.

News March 15, 2025

హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్

image

AP: తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవచ్చన్నారు.

News March 15, 2025

ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

image

TG: తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పైనా డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

error: Content is protected !!