News March 14, 2025
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు..

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూనగర్ జిల్లా కొత్తపల్లిలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా జక్లేరులో 40.1 డిగ్రీలు, వనపర్తి జిల్లా కేతపల్లిలో 40.0 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో 40.0 డిగ్రీలు, గద్వాల జిల్లా మల్దకల్లో 40.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News September 19, 2025
బైరెడ్డి హౌస్ అరెస్ట్

నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డా.దారా సుధీర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు వెళ్తున్న ఆయనను నందికొట్కూరు డిగ్రీ కాలేజ్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.
News September 19, 2025
శాసనమండలి వాయిదా

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.
News September 19, 2025
కామారెడ్డి జిల్లా వర్షపాతం వివరాలు

కామారెడ్డి జిల్లా వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. బీబీపేట, సర్వాపూర్‌లో 9.3 మి.మీ, ఎల్పుగొండలో 9, భిక్కనూర్ 5.3, దోమకొండ 4.5, రామలక్ష్మణపల్లి 4.3, మేనూర్ 2.8, పెద్ద కొడప్గల్ 1.8, ఐడీవోసీ (కామారెడ్డి), పాత రాజంపేట 1.5, సదాశివనగర్ 1, జుక్కల్‌లో 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల వర్షం ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.