News March 14, 2025

మంచిర్యాల: PHOTO OF THE DAY

image

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.

Similar News

News November 7, 2025

సూర్యాపేట: భార్యను చంపిన భర్త

image

సూర్యాపేట జిల్లా మోతె మండలం విభాళాపురంలో దారుణం జరిగింది. భర్త మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 7, 2025

కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

image

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.

News November 7, 2025

వందేమాతరం దేశభక్తిని మేల్కొలిపే శక్తి: జేసీ

image

వందేమాతరం నినాదం మనందరిలో దేశభక్తిని మేల్కొలిపే ఒక శక్తి అని జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు. వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఏకస్వరంతో వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతరం గీతం స్వాతంత్య్ర స్ఫూర్తికి మూలం అని ఆయన తెలిపారు. ఈ గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారని గుర్తు చేశారు.