News March 14, 2025
నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్

ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,020 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు స్థిరమైన విద్యుత్ సదుపాయం కల్పించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.
News April 3, 2026
సిరిసిల్ల: కలకలం సృష్టిస్తున్న పెద్దపులి సంచారం!

వీర్నపల్లి, కోనరావుపేట సరిహద్దుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్, KNR జిల్లాల అటవీ ప్రాంతం పులికి ఆవాసయోగ్యం కానందున అధికారుల్లో ఆందోళన నెలకొంది. పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పొలాల వద్ద త్రీ ఫేజ్ విద్యుత్ నిలిపివేస్తున్నామని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పులిని గుర్తించే అటవీ శాఖ ట్రాకింగ్ వ్యవస్థ పని చేయడం లేదని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.


