News March 23, 2024

ఉత్కంఠ పోరులో SRH ఓటమి

image

సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20ఓవర్లలో 208 రన్స్ చేయగా.. చేధనకు దిగిన హైదరాబాద్ చివరి వరకు పోరాడి 204 రన్స్ చేసింది. క్లాసెన్ (25 బంతుల్లో 61) అద్భుత పోరాటం వృథా అయింది. చివరి ఓవర్లో క్లాసెన్, షాబాజ్ ఔట్ కావడంతో KKR 4 రన్స్ తేడాతో గెలిచింది. రస్సెల్ బ్యాటింగ్‌లో 64 రన్స్, బౌలింగ్‌లో 2వికెట్లతో రాణించారు.

Similar News

News September 14, 2025

భారత్-పాక్ మ్యాచ్: షేక్ హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు

image

ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. టాస్ సమయంలో కనీసం పలకరించుకోకపోగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని ఇండియన్ ఫ్యాన్స్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

News September 14, 2025

BREAKING: పాకిస్థాన్ స్కోర్ ఎంతంటే?

image

ASIA CUP-2025: టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. 20 ఓవర్లలో ఆ జట్టు 127/9 పరుగులు చేసింది. భారత పేసర్లు, స్పిన్నర్ల ధాటికి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. కుల్దీప్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2, హార్దిక్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. చివర్లో షాహీన్ అఫ్రిది 4 సిక్సర్లు బాదారు. మరి భారత్ ఎన్ని ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తుందో కామెంట్ చేయండి.

News September 14, 2025

పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు: అధికారులు

image

AP: <<17705296>>తురకపాలెం<<>>లో నీటిలో పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. తాగు నీటిలో యురేనియం లీటరుకు 30 మైక్రో గ్రాములు(0.03 mg/l)గా ఉంటుందని, తురకపాలెంలో యురేనియం ఆనవాళ్లు 0.001 mg/l కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు రోజులుగా కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదన్నారు.