News March 14, 2025
మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచం: తిరుపతి SP

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్క మహిళ మొబైల్ లో “శక్తి” యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి సహాయం పొందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ (SHAKTI App) ను రూపొందించిందని తెలిపారు.
Similar News
News March 21, 2026
ఉదయాన్నే కాఫీ/టీ తాగితే..

కాఫీ, టీ తాగితే మంచిదా? కాదా? అనే అంశంపై విభిన్న ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా USకు చెందిన హార్వర్డ్, MIT సైంటిస్టులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉదయాన్నే కెఫిన్ ఉన్న కాఫీ/టీని మితంగా తీసుకుంటే డిమెన్షియా(మతిమరుపు) ప్రమాదం 18% తగ్గుతుందని పేర్కొన్నారు. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 43 ఏళ్లలోపు వయసున్న 1,31,821 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు.
News March 21, 2026
తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది: బండి సంజయ్

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇది ప్రజలను వంచించే బడ్జెట్ అని, అంకెల ఆర్భాటాలు తప్ప ఒరిగేదేమీ లేదని మీడియాతో అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ‘డ్రగ్స్ కేసులో సీఎంకు చిత్తశుద్ధి లేదు. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’ అని ఆరోపించారు.
News March 21, 2026
నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.


