News March 14, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్ధం శ్రీకాకుళం, పలాస మీదుగా షాలిమార్(SHM), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న VSKP- SHM(నం.08577), 17న SHM- VSKP(నం.08578) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్‌తో పాటు విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 16, 2026

SSC ఎగ్జామ్స్ శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడలోని ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండగా..ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.

News March 16, 2026

శ్రీకాకుళం జడ్పీలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.