News March 14, 2025

టాటా కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా గణపతి సుబ్రహ్మణ్యం

image

తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా టాటా సంస్థ గణపతి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. నామినేషన్-రెమ్యునరేషన్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన 2021లో బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టీసీఎస్‌లో ఆయన గత 40 ఏళ్లుగా సేవలందించారు. ఆ సంస్థకు సీఓఓగా పనిచేసి గత ఏడాది మేలో పదవీవిరమణ చేశారు.

Similar News

News November 10, 2025

అభిషేక్ సరైన ఓపెనర్: పీటర్సన్

image

ఆస్ట్రేలియా టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన భారత బ్యాటర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. ‘టీ20 క్రికెట్‌కు అభిషేక్ సరైన ఓపెనర్. ధైర్యం, టాలెంట్ ఉన్న బ్యాటర్. ఆస్ట్రేలియా టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు’ అని పొగిడారు. 163 రన్స్‌తో ఆసీస్ టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచిన సంగతి తెలిసిందే.

News November 10, 2025

వంటింటి చిట్కాలు

image

*క్యాబేజీ కర్రీ వండినప్పుడు కాస్త పచ్చి వాసన వస్తుంటుంది. అది రాకుండా ఉండాలంటే.. కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం ముక్క వేయండి.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* దోశెల పిండి పులిస్తే అందులో కాస్త గోధుమ పిండి కలిపితే దోశెలు రుచిగా వస్తాయి.
* చెక్క గరిటలు వాసన వస్తుంటే కాస్త వెనిగర్ వేసిన నీటిలో పదినిమిషాలు నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.

News November 10, 2025

నటుడు అభినయ్ మృతి

image

నటుడు అభినయ్(44) మరణించారు. కొన్నేళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ చెన్నైలో కన్నుమూశారు. తన చివరి రోజుల్లో చికిత్సకు అవసరమైన డబ్బు కోసం ఆయన ఎదురుచూడాల్సి వచ్చిందని స్నేహితులు చెప్పారు. ధనుష్ తొలి సినిమా ‘థుల్లువాదో ఇళమై’తో అభినయ్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ్, కన్నడలో సుమారు 15కు పైగా చిత్రాల్లో నటించారు. ఓరియో బిస్కెట్స్ సహా పలు యాడ్స్‌లోనూ కనిపించారు.